కాంగ్రెస్ ఆద్వర్యంలో ధర్నా…

వతెలంగాణ – అశ్వారావుపేట
ధరణి రద్దు, పోడు భూములకు పట్టాలు కోరుతూ పీసీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా కు నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అశ్వారావుపేట – సత్తుపల్లి రోడ్ లో పార్టీ కార్యాలయం నుండి తహశీల్ధార్ కార్యాలయం వరకు ముందుగా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, మహాత్మా జ్యోతీ రావు ఫూలే విగ్రహాలు కు పూల మాలలు నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం తహశీల్దార్ ప్రసాద్ కు వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యురాలు సున్నం నాగమణి, మొగుళ్ళపు చెన్నకేశవరావు, సుంకవల్లి వీరభద్రరావు, మాజీ జెడ్పీటీసీ అంకత మల్లికార్జున్ రావు, ఎంపీటీసీ వేముల భారతి, ధన్జూ నాయక్, వగ్గెల పూజ, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love