– ఒకే రోజు ఐదుగురి పై దాడి..
– కుక్క ను హతమార్చిన గ్రామస్తులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
పిచ్చి కుక్క దాడి లో 8 మందికి గాయాలు అయ్యాయి.అశ్వారావుపేట పంచాయితి పరిధిలో సంచరించే ఈ కుక్క శుక్రవారం ఐదుగురు,గురువారం ముగ్గురు మొత్తం 8 మంది పై దాడి చేసింది.దాడికి గురైన వారిలో గ్రామ పంచాయితీ కార్మికురాలు ఉండటం గమనార్హం. దాడి చేసిన పిచ్చి కుక్క ను గ్రామస్తులు హతమార్చినట్లు ఈఓ హరిక్రిష్ణ తెలిపారు. పిచ్చి కుక్క అని నిర్ధారణ కావడంతో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏ.ఆర్.వి సూది మందు ఇచ్చిన అనంతరం ఇమ్యునో గ్లోబలిన్ సూది మందు కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి బాధితులను తరలించినట్లు ప్రధాన వైద్యులు డాక్టర్ పూర్ణ చంద్ర రావు తెలిపారు.