రక్షా బంధన్ రోజున జన్మించిన కవలలు.. అన్నా, చెల్లెళ్లుగా జననం

నవతెలంగాణ –  భద్రాద్రి కొత్తగూడెం
కవలలు జననం అరుదు. ఈ జననంలో ఇరువురు ఆడ లేక మగ పిల్లలు జన్మించడం సాధారణం.కానీ ఈ అరుదైన కవలల జననంలోనూ అరుదు అన్నా చెల్లెళ్ళు జన్మించడం ఇంకా అరుదు. అదీ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ రోజు జన్మనివ్వడం అరుదైన వైనం. ఇలాంటి అరుదైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని నియోజక వర్గం కేంద్రం అయిన భద్రాచలం పట్టణంలో గల శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో రాఖీ పర్వదినం అయిన గురువారం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, మోరంపల్లి బంజరు కు చెందిన గర్భిణీ పాండవుల సాయి గీత ప్రసవం కోసం భద్రాచలం పట్టణంలోని శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది.గురువారం ఉదయం 9 గంటలకు శ్రీ సురక్ష హాస్పిటల్ లో  ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ సూరపనేని శ్రీ క్రాంతి శస్త్ర చికిత్స చేయగా కవలలు జన్మించారు.కాగా రక్షాబంధన్ రోజున అన్నాచెల్లెళ్ల బంధానికి మారు రూపు గా అన్న, చెల్లె లు కవల లు గా జన్మించటం విశేషంగా చోటు చేసుకుంది. రక్షాబంధన్ రోజున అన్న చెల్లి జన్మించడంతో కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ సూరపనేని శ్రీ క్రాంతికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు డైరెక్టర్స్ డాక్టర్ అక్కినేని లోకేష్, డాక్టర్ సూరపనేని శ్రీ క్రాంతి మాట్లాడుతూ రక్షాబంధన్ రోజున మా హాస్పటల్ నందు మొదటి కాన్పు లోనే కవలలు అన్నా, చెల్లికి జన్మనివ్వడం చాలా సంతోషంగా ఉందని, అలాగే తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారని తెలిపారు.
Spread the love