విద్యావ్యవస్థలో పీఈటీల పాత్ర కీలకం 

వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అని ఎంపిపి శ్రీరామమూర్తి
వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అని ఎంపిపి శ్రీరామమూర్తి
– ఎం పీ పీ శ్రీరామమూర్తి
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యా వ్యవస్థలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అని ఎంపిపి శ్రీరామమూర్తి ఆన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బి.సి బాలురు గురుకుల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులను ఘనంగా  సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యా విధానంలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మన దేశం మన రాష్ట్రం క్రీడలకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుందని గతంతో పోల్చుకుంటే మన దేశం క్రీడల పట్ల మెరుగుపడింది అని, మనవాళ్లు గొప్ప గొప్ప పథకాలు తెచ్చి మన కీర్తి ప్రతిష్టలు పెంచుతున్నారు అని అన్నారు.
           లయన్స్ క్లబ్ చైర్ పర్సన్ చలపతిరావు మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులకు క్రీడ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వ్యాయామ ఉపాధ్యాయుల అవసరం ప్రస్తుత విద్యా విధానంలో అంతర్భాగమని చదువు తోపాటు క్రీడలు కూడా జీవితంలో భాగమని  చదువుకుంటూనే క్రీడలలో పాల్గొని ప్రతి ఒక్కరూ రాణించాలని వ్యాయామ విద్యతో విద్యార్థుల పట్ల మంచి ప్రవర్తన, నడవడిక అలవర్చుకుంటారని అన్నారు. అలాగే తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పీ.ఈ.టీ లు మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం రోజు మమ్మల్ని గుర్తించి ఈ విధంగా సత్కరించడం చాలా సంతోషకరమని అందుకు లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు దుర్గారావు, సభ్యులు బ్రహ్మ రావు, రామారావు, పుల్లారావు, బీసీ గురుకుల ప్రిన్సిపల్,బోధనా సిబ్బంది,వ్యాయామ ఉపాధ్యాయులు రాజు, శ్రీను రామారావు, అశోక్ , వసంత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love