నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ శుక్రవారం భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.డాక్టర్ బూర నరసయ్య గౌడ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత చరిత్రను,ప్రేరణ సూక్తులను ప్రజలను వివరించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరారు.స్వామి వివేకనంద రాసిన పుస్తకాలను సభా వేదికపై విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర సహా కార్యదర్శి గణపురం రాజేశ్వర్ రెడ్డి సెంట్రల్ సెన్సార్ బోర్డు నెంబర్ ఏనుగు సుధాకర్ రెడ్డి టెలికాంబోర్డు అడ్వైజరి మెంబర్ రమణగోని శంకర్ అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్,బత్తుల జంగయ్య గౌడ్ సర్పంచ్ రాణిరంగారెడ్డి ఎంపీటీసీ దోసపాటి జ్యోతి జంగయ్య గౌడ్ బిజెపి నాయకులు ఉడుగు యాదయ్యగౌడ్,బత్తుల కృష్ణగౌడ్,సహదేవ్,ధనరాజ్, శంకర్,వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.