టమోటలకు కాపలాగా బౌన్సర్లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : టమోటా ధరలు వింటే జనాలకు వణుకు పుడుతుంది.. మొన్నటివరకు పది రూపాయాలు పలికే టమోటా.. నేడు మార్కెట్ లో కిలో వచ్చి రూ.150 పలుకుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూరగాయల దుకాణాల్లో టమాటాలు చోరీకి కూడా గురవుతున్నాయి. అంతేందుకు టమోటాలను తోటల నుంచి తీసుకెళ్తున్నారు. అందుకే టమాటా వ్యాపారులు తమ దుకాణాల్లో టమాటాలు చోరీకి గురి కాకుండా కస్టమర్లను నియంత్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓ ప్రాంతంలో కూరగాయల వ్యాపారి వినూత్న ఆలోచన చేశాడు.. ఏకంగా టమోటాలకు సెక్యూరిటీగా బౌన్సర్లను పెట్టుకున్నాడు. ఇందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదేంటని అడిగితే కస్టమర్లు టమాటాలు చోరీకి పాల్పడుతున్నారని లేదంటే టమాటాల కోసం తోపులాట జరుగుతోందని అందుకే బౌన్సర్లను నియమించుకున్నట్లుగా తెలిపాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో ఓ కూరగాయల దుకాణం దగ్గర చోటు చేసుకుంది. పబ్‌లు, సెలబ్రిటీ ఈవెంట్‌లు, లేదంటే వీఐపీల కు రక్షణగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటారు. అయితే వారణాసిలో కూరగాయల వ్యాపారి కొద్ది రోజులుగా బౌన్సర్లను నియమించడం చర్చనీయాంశమైంది.

Spread the love