తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం..

– కాంగ్రెస్ డిసిసి అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి
నవతెలంగాణ – మీర్ పేట్
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లెలగూడ దీన్ దయాల్ నగర్ కాలనీలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు బిచ్చ నాయక్, సాయిని మల్లేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. ఒకప్పుడు పార్టీల్లోకి వచ్చే వారు కారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ కావట్టి తామే స్వయంగా వస్తామని చెబుతున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు క్లీన్ స్వీప్ అయ్యే స్థితికి చేరతావని వివరించారు. అమరవీరుల త్యాగాలకు గుర్తింపు, నియామకాలు నిరుద్యోగ నిర్మూలన, యువతి యువకుల సాధికారత, మెరుగైన విద్య వంటి సమగ్ర అభివృద్ధి, సంక్షేమము లక్ష్యంగా కాంగ్రెస్ అధికారం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులు, యువత, కార్మిక, కర్షక, బడుగు, బలహీన అట్టడుగు వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ఉత్సాహంతో ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పని చేసే వారికి పార్టీ గుర్తింపు, రాజకీయ భవిష్యత్తు తప్పక ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, మాజి జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దేవగోని కృష్ణ, జిల్లా జనరల్ సెక్రెటరీ ఎరకల వెంకటేష్ గౌడ్, మీర్ పేట్ కార్పొరేటర్ సిద్దాల మౌనిక శ్రీశైలం, ఎంపిటిసి నిమ్మల వెంకటేష్ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ కీసర యాదిరెడ్డి, మాజీ మహిళా అధ్యక్షురాలు గంగమ్మ, మల్లేష్, ఎన్ఎస్యుఐ దీక్షిత్, రంజిత్, సందీప్, రవీందర్, శంకర్, రాజు,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love