బ్రసిలియా : సాంస్కృతిక ప్రాజెక్టులకు పార్లమెంటరీ నిధులను మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సో నారోపై రూపొందించిన చిత్రం కూడా ఈ ప్రాజెక్టులలో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో బ్రెజిల్ సోషలిస్ట్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు తబటా అమరాల్ దాఖలు చేసిన ఫిర్యాదును పురస్క రించుకొని న్యాయమూర్తి ఫ్లావియో దినో ఈ ఆదేశాలు జారీ చేశారు. సైనిక తిరుగుబాటుకు కుట్ర పన్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో బోల్సోనారో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. బోల్సోనారో ఎలక్టొరల్ మార్కెటింగ్, ఆడియోవి జువల్ కంటెంట్ కోసం పార్లమెంటరీ సవరణల ద్వారా ప్రభుత్వ నిధులను ఉపయోగించి ఉండవచ్చునని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. బోల్సోనారో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి చెందిన పలువురు చట్టసభ సభ్యులు పార్లమెంటరీ సవరణల ద్వారా పెద్ద మొత్తంలో సొమ్మును బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును బోల్సోనారో జీవితంపై నిర్మించే ‘డార్క్ హార్స’ అనే చిత్రం కోసం ఉద్దేశించారని తెలుస్తోంది. చిత్ర నిర్మాణానికి ప్రభుత్వ బడ్జెట్ నిధులను చట్టవిరుద్ధంగా ఉపయో గించారా లేదా అనే విషయాన్ని నిర్ధారించు కోవడానికి అధికారులు ప్రయత్ని స్తున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరిస్తున్న నేపథ్యంలో కేసును గోప్యంగా ఉంచారు.
బోల్సోనారో చిత్రానికి నిధులపైదర్యాప్తునకు బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



