– ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా పీఎస్ సీఐ,ఎస్ఐ
నవతెలంగాణ-వికారాబాద్
వికారాబాద్ పట్టణంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో రూ.20వేలు లంచం తీసుకుంటూ సీఐ సరోజ, ఎస్ఐ రాణి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఇర్షద్‌పై భార్య వేధింపుల కేసు పెట్టింది. ఈ విషయంలో మహిళా పోలీస్స్టేషన్ల్లో ఇర్షద్ తల్లి, అక్కాచెల్లెళ్లు మొత్తం 6 మందిపై కేసు నమోదైంది. ఈ విషయంపై మాట్లాడటానికి వారిని సీఐ, ఎస్ఐ స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఒక్కరికి రూ.పది వేల చొప్పున రూ.60వేలు డిమాండ్ చేయగా.. రూ.40వేలకు ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం సీఐ, ఎస్ఐ రూ.20వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పీఎస్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
స్టేషన్ బెయిల్‌కు రూ.60వేల లంచం డిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



