Monday, September 21, 2026
E-PAPER
Homeఆటలుభారత్‌కు కాంస్య పతకం

భారత్‌కు కాంస్య పతకం

- Advertisement -

కౌలాలంపూర్‌ 
లాక్రోస్‌ ఫ్రెండ్లీ సిరీస్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ :

అంతర్జాతీయ లాక్రోస్‌ ఆటలో భారత మహిళలకు కాంస్య పతకం దక్కింది. మలేషియాలోని కౌలాలంపూర్‌ వేదికగా జరిగిన ఈ పోటీల్లో మహిళల విభాగంలో ఆరు జట్లు, పురుషుల విభాగంలో ఎనిమిది జట్లు పోటీపడ్డాయి. మహిళల విభాగంలో హాంగ్‌కాంగ్‌ విజేతగా నిలువగా.. భారత మహిళల జట్టు కాంస్య పతకం సాధించింది. కాంస్య పతకం సాధించిన భారత జట్టులో తెలంగాణ గురుకుల విద్యార్థినిలు ఉండటం గమనార్హం. తెలంగాణ బిసి గురుకులాల్లో చదువుతున్న పి. గోపిక, సంగీతలు కౌలాలంపూర్‌ ఫ్రెండ్లీ సిరీస్‌లో రాణించి, రాష్ట్రానికి, దేశానికి గర్వ కారణంగా నిలిచారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, కమిషనర్‌ బాల మాయదేవి, కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -