- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ :
తెలంగాణ రైఫిల్ సంఘం (టిఆర్‌ఏ) అధ్యక్షుడిగా అమిత్ సంఘీ మళ్లీ ఎన్నికయ్యాడు. సోమవారం టిఆర్‌ఏ వార్షిక సర్వ సభ్య సమావేశంలో 2026-30కి నూతన కార్యవర్గాన్ని ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. అమిత్ సంఘీ ప్రెసిడెంట్‌గా.. వసీఫ్ హసన్ లతీఫ్, మహ్మద్ సోహైలుద్దీన్ ఫరూకీ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా జమల్పూరి కిరణ్, కోశాధికారిగా వంశీధర్, సంయుక్త కార్యదర్శిగా మహ్మద్ ముస్తాఫా ఖాన్‌లను ఎన్నుకున్నారు. నర్సయ్య, శ్రవణ్ కుమార్, షరీఫ్, అనీశా, సత్యా రాణి, షతీఫ్ అలీ ఖాన్, అబ్దుల్ ఖదీర్ ఖాన్‌లు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు తెలంగాణ రైఫిల్ సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.
- Advertisement -



