కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలోని టీఆర్‌ఆర్‌ నివాసంలో చౌడాపూర్‌ మండలం పుర్సంపల్లి గ్రామం, అడవి వెంకటాపురం గ్రామం నుంచి మండల అధ్యక్షుడు ఎల్పటి అశోక్‌ కుమార్‌, అడవి వెంకటాపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు రవి నాయక్‌ పురుషంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు కష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే,డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్‌ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ తోనే అభివద్ధి సాధ్యమని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. అందు కోసమే ఎంతోమంది కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారు రోమ్యల రాజు, రాజ గోవర్ధన్‌ రెడ్డి,ఎర్రం సాయ్యన్న, కావాలి కష్ణయ్య, మద్దేని నర్సింలు, రొమ్యాల శేఖర్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, పల్లి రాములు, ఆర్‌ అంజయ్య, ఆర్‌ చిమయ్య, ఆర్‌ మొగులయ్య, రవి, సునీల్‌, రాజేష్‌ ఆంజనేయులు, మండల ప్రధాన కార్యదర్శి దామోదర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు నరసింహ నాయక్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకటయ్య గౌడ్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు రాము, ఎంపీటీసీ క్షత్రియ నాయక్‌, రవి, అంజి నాయక్‌, రాములు నాయక్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love