కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

నవతెలంగాణ-కొత్తూరు
కొత్తూరు మండల మున్సిపాలిటీ ప్రాంతాలకు చెందిన పలువురు బీఆర్‌ ఎస్‌ నాయకులు మంగళవారం షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కొత్తూరు పట్టణ బీఆర్‌ఎస్‌ నాయకులు జనార్ధన్‌చారి, బ్యాగరి యాదయ్య, బీఆర్‌ఎస్‌ మల్లాపూర్‌ గ్రామ కమిటీ అధ్యక్షులు మోహన్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, నరసింహ, లక్ష్మారెడ్డి, రఘు పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు హరినాథ్‌రెడ్డి, మల్లాపూర్‌ మాజీ సర్పంచ్‌ చిర్రా సాయిలు, బల్వంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.

Spread the love