మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు

నవతెలంగాణ-రామగిరి: రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు మాజీ వార్డ్ సభ్యులు గురువారం పెద్ద ఎత్తున మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎండి చాంద్ పాషా, మాజీ సర్పంచ్ ఎరుకల బాపూరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారిని ఐటి , పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పార్టీ కండువాపీ పార్టీలోకి స్వాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, గత 10 ఏండ్లుగా బిఆర్ఎస్ పార్టీలో ఉండి ఏమి సాధించలేకపోయామని ఎలాంటి సంక్షేమ పథకాలు మాకు చేరలేదని కలత చెంది బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో అనేక సంక్షేమ అభివృద్ధి పనులు చేస్తున్న దానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని వారన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ, మంత్రి శ్రీధర్ బాబు కోసం అహర్నిశలు కృషి చేసే వారి అడుగుజాడల్లో నడుచుకుంటామని ఎంపీ ఎలక్షన్లలో నాగపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పనిచేసి మెజార్టీ తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశారు.
పార్టీలో చేరిన నాయకులు తాజా మాజీ వార్డు సభ్యులు సట్ల రాజ్ కుమార్ గౌడ్, ఎర్రం శంకర్ ముదిరాజ్,చింతం మహేందర్, పొనం శ్రీనివాస్ గౌడ్, ఎర్రం కుమార్ ముదిరాజ్, నిమ్మల చంటి,తిప్పని సతీష్, రవి, నేరెళ్ల సారయ్య గౌడ్. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మాజీ జడ్పిటిసి సభ్యులు ఎల్లే రామ్మూర్తి, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య, ఎండి చాంద్ పాషా, మాజీ సర్పంచ్ , మండల పార్టీ అధ్యక్షుడు రొడ్డ బాపన్న,ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య, ఎరుకల ప్రదీప్, పుప్పాల సంపత్, తొట్ల ప్రసాద్ యాదవ్, సందెల కుమార్, కల్వల శంకర్, బీసీ సెల్ మండల నాయకులు బండారి సదానందం, పందుల సతీష్, పందుల సోమశంకర్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love