కొనరావుపేటలో చిరుత పిల్లల సంచారం..

నవతెలంగాణ- కొనరావుపేట
కోనరావుపేట మండలం శివంగలపలే శివారులో చిరుత పిల్లల సంచారం కలకలం రేపుతుంది. గురువారం రాత్రి సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుత పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా ఒక పిల్లను చిరుత తీసుకు వెళుతుండగా తెల్లవారుజామున పక్కన పొలం పనుల వద్దకు వెళుతున్న రైతు చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడ ఉన్న ఆ చిరుత పిల్లను చూచేందుకు మండలం నుంచి అధిక సంఖ్యలో జనం తరలివచ్చి ఆ చిరుత పులి పిల్ల. తో ఫోటోలు దిగుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి వచ్చి, ఆ చిరుత పిల్లను కరీంనగర్ తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.
Spread the love