హీరో విజయ్ ఆంటోని భావోద్వేగపు పోస్ట్‌

హైదరాబాద్‌ : హీరో విజయ్ ఆంటోనీ.. తన పెద్ద కుమార్తె (16) ఆత్మహత్యపై ఎక్స్‌ వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్‌ చేశారు. తన కుమార్తెతో పాటే తాను చనిపోయానని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇక నుంచి తాను చేసే ప్రతి మంచి పనిని ఆమె పేరునే చేస్తానని.. అలాగైనా ఆమెతో కలిసి ఉన్నట్లుగా భావిస్తానని అన్నారు.
” నా పెద్ద కుమార్తె చాలా ధైర్యవంతురాలు. ఆమె దగ్గర దయాగుణం కూడా ఉంది. కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం.. ఇవేవి లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి తను వెళ్లిపోయింది. తను ఇప్పటికీ నాతోనే మాట్లాడుతోంది. తనతో పాటే నేను కూడా చనిపోయాను. ఇక ఇప్పటినుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను.” విజయ్ చేసిన ట్వీట్‌ చూసి, ఆయన అభిమానులు ధైర్యం చెప్పారు. ” ఆ దేవుడు మీకు మనోబలాన్ని ఇవ్వాలి’, ‘ఆమె ఆత్మకు శాంతి కలగాలి’, ‘మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి ” అని సమాధానాలు ఇచ్చారు.

Spread the love