నా ఫ్యాన్స్‌ అంతా మా దేవర ఫ్యామిలీనే..

– విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మూడు రోజుల్లో 70.23 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేయడంతో ‘ఖుషి’ బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాత నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ, ‘మా సంస్థకు ‘ఖుషి’ లాంటి మెమొరబుల్‌ మూవీ ఇచ్చిన విజయ్, సమంత, శివకి థ్యాంక్స్‌. మణిరత్నం ‘రోజా’ లాంటి ఫీల్‌ ఇచ్చే సినిమా ఇది. ఇలాంటి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించినందుకు గర్వంగా ఉంది. విజరు కెరీర్‌లోనే హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచే సినిమా ఇది’ అని అన్నారు. ‘నా సినిమాల్లో ‘ఖుషి’ ఎందుకు స్పెషల్‌ అంటే.. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా చూశాక ఆ హ్యాంగోవర్‌ నుంచి బయటకు రాలేకపోయాను. రెండు, మూడేళ్లలో విజయ్ తో సినిమా డైరెక్ట్‌ చేయాలని గట్టిగా అనుకున్నాను. ఇవాళ ‘ఖుషి’ లాంటి మంచి సినిమాను రూపొందించ గలిగాను’ అని డైరెక్టర్‌ శివ నిర్వాణ చెప్పారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ,’ఈ సినిమా మీద మీరు చూపిస్తున్న ప్రేమ నాకు తెలుస్తోంది. మీ ప్రేమకు కతజ్ఞతగా చాలా చాలా చేయాలని అనిపిస్తోంది. ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా. నా సంపాదన నుంచి, ‘ఖుషి’ సంపాదన నుంచి కోటి రూపాయలు నా ఫ్యామిలీ అయిన మీకు ఇస్తున్నా. మరో పది రోజుల్లో వంద ఫ్యామిలీస్‌ను సెలెక్ట్‌ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్‌ అందిస్తా. నా హ్యాపీనెస్‌లాగే నా సంపాదన కూడా మీతో షేర్‌ చేసుకుంటా. మీరంతా దేవర ఫ్యామిలీ’ అని అన్నారు.

Spread the love