ఉపేంద్ర గాడి అడ్డా.. పక్కా మాస్‌ సినిమా

Upendra Gadi Adda.. Pakka Mass Movieకంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కష్ణ హీరోయిన్‌గా ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. దర్శకత్వంలో ఎస్‌. ఎస్‌.ఎల్‌. ఎస్‌. క్రియేషన్స్‌ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, ‘ప్రస్తుతం హీరో, హీరోయిన్‌ల మీద సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్‌ మొత్తం పూర్తయ్యేవరకు సింగిల్‌ షెడ్యూల్‌ జరుపుతున్నాం. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. వాటి రికార్డింగ్‌ జరుగుతోంది’ అని అన్నారు. ‘చక్కటి కమర్షియల్‌ అంశాలతో ఉండే మాస్‌ సినిమా ఇది. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్టు యూత్‌ ఫుల్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా. హీరో పాత్ర పక్కా మాస్‌ అయితే, హీరోయిన్‌ పాత్ర బాగా డబ్బున్న అమ్మాయిగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అని దర్శకుడు ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. చెప్పారు. హీరో, హీరోయిన్లు మాట్లాడుతూ, ‘నటించడానికి ఎంతో అవకాశం ఉన్న పాత్రలను పోషిస్తున్నాం. కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రమవుతుంది’ అని తెలిపారు.

Spread the love