సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి

– కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్
నవతెలంగాణ తుంగతుర్తి: నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ లు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని,గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ నాయకులు లూటీ చేసి అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత వారిదేనని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదని, ఒక్కొక్క ఎమ్మెల్యే వేలకోట్లు సంపాదించుకున్నారని అన్నారు.
ఓటమిని జీవించుకోలేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, ఇకనైనా అహంకారపూరిత మాటలు మానుకోకపోతే లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి,మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ లకు లేదన్నారు. వారు చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలని,లేనియెడల నియోజకవర్గంలో వారిని తిరగనియ్యమని హెచ్చరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తిరుమలప్రగడ కిషన్ రావు, ఓరుగంటి సత్యనారాయణ, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ కొండ రాజు, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ఉప్పుల రాంబాబు,నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ రామడుగు నవీన్, నాయకులు కుంచాల ప్రవీణ్ రెడ్డి, మండల మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండి అబ్దుల్, అక్కినపల్లి నరేష్, గుగులోతు భాస్కర్, దేవరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love