ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్‌ గల్లంతే

– కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌ రెడ్డి రంగారెడ్డి
– కేసీఆర్‌ సర్కార్‌కు చరమగీతం పాడటం ఖాయం
– సబ్బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం
– ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం
– కాంగ్రెస్‌లోకి ఇ.పట్నం మున్సిపల్‌ కౌన్సిలర్లు బర్ల మంగ జగదీశ్వర్‌
నవతలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తెలంగాణ ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్‌ గల్లంతేనని కాంగ్రెస్‌ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. కేసిఆర్‌ సర్కార్‌కు చరమగీతం పాడటం ఖాయమన్నారు. అవినీతి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్‌ బర్ల మంగ జగదీశ్వర్‌ దంపతులు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై తమ కార్యకర్తలతో, అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో చేరారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీఆర్‌ఎస్‌ చేస్తున్న మోసాలను, అరాచకాలను ప్రజలకు వివరించాలని కోరారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. బీఆర్‌ఎస్‌ను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని గుర్తు చేశారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 25రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీలో చేరిన వారు కష్టపడి పనిచేస్తే పదవులు వాతంటత అవే వెతుక్కుంటూ వస్తాయని అన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా బర్ల జగదీశ్వర్‌ మాట్లాడుతూ…పట్నం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌ రెడ్డినీ ఓడించేందుకు తాము కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. నియోజకవర్గంలో మల్‌ రెడ్డి రంగారెడ్డికి మద్దతుగా గడపగడపకు వెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ చేస్తున్న మోసాలను అరాచకాలను ప్రజలకు వివరిస్తానని అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మల్‌ రెడ్డి రంగారెడ్డి గెలుపు కోసం తాను నిరంతరం శ్రమిస్తానని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని అన్నారు. మల్‌ రెడ్డి రంగారెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూధన్‌ రెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కప్పరి స్రవంతి చందు, కౌన్సిలర్‌ ఆకుల మమత, మున్సిపల్‌ అధ్యక్షులు ఆకుల నందు, మాజీ సర్పంచ్‌ కప్పరి లక్ష్మయ్య, తదితరులు ఉన్నారు.

Spread the love