బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య

– అభివృద్ధికి ఆకర్షితులై చేరికలు
నవతెలంగాణ-చేవెళ్ల
బీఆర్‌ఎస్‌ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని గుండాల ఎంపీటీసీ తిపని సుజాత శివారెడ్డి, కాంతరెడ్డితో పాటు సుమారు 300 మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందుతున్నారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, చేవెళ్ల జడ్పీటీసీ సభ్యురాలు మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి, ఆయా గ్రామాల సర్పం చులు భీమయ్య, మల్లారెడ్డి, నడిమొళ్ల లావణ్యశంకర్‌, మోహన్‌ రెడ్డి, వెంకటేశం గుప్తా, మాజీ ఎంపీపీ బాల్‌ రాజు, మండల ప్రధాన కార్యదర్శి మల్గని నరేందర్‌ గౌడ్‌, మైనార్టీ జిల్లా నాయకులు అలీ, మాజీ వైస్‌ ఎంపీపీ పోలీస్‌ వెంకట్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ గణేష్‌, నాయకులు విష్ణు వర్ధన్‌ రెడ్డి, మాణిక్య రెడ్డి, మల్లారెడ్డి, వెంకట్‌ రెడ్డి, గంగిడ్డి శ్రీరాం రెడ్డి, గంగిడి శ్రీనివాస్‌ రెడ్డి, బాలరాజ్‌, శ్రీనివాస్‌, వీరేందర్‌ రెడ్డి, వెంకటయ్య, రాంరెడ్డి, హాసిఫ్‌, బాసీత్‌, విఠల్‌ రెడ్డి, మల్లారెడ్డి, మల్లేష్‌, జగన్‌ రెడ్డి, కోలన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, దయాకర్‌ ముదిరాజ్‌, రంగారెడ్డి, నర్సింహాలు తదితరులు ఉన్నారు.

Spread the love