కాటాపూర్ లో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం

నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలో బీఆర్ఎస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మండల అధ్యక్షుడు దండల మల్లయ్య ఆధ్వర్యంలో మండలంలో విస్తృత ప్రచారం బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం కాటాపూర్లో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి రామసాయం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిటిసి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముండ్రాది రాజమౌళి, గ్రామ కమిటీ అధ్యక్షులు రంగు సత్యనారాయణ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య, యూత్ నాయకులు తడక హరీష్, పాలకుర్తి రవీందర్, దేసోజు కోటయ్య లు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వానికి గెలిపించాలని కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అభివృద్ధి గణనీయంగా సాధించామని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే విధంగా అధిక మెజార్టీతో గెలిపించాలని ఇల్లు ఇల్లు తిరిగి కోరుతున్నారు.
Spread the love