
నవతెలంగాణ- కమ్మర్ పల్లి :
రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ పరామర్శించారు. ఇటీవల మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం వేల్పూర్ లోని మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసానికి విచ్చేసిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మంజులమ్మ చిత్ర పటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేటీఆర్ వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధు శేఖర్, తదితరులు ఉన్నారు.