Wednesday, June 24, 2026
E-PAPER
Homeబీజినెస్500 శాఖలను విస్తరించనున సుప్రా పసిఫిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్

500 శాఖలను విస్తరించనున సుప్రా పసిఫిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : బీఎస్ఈలో నమోదైన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్ బి ఎఫ్ సి) అయిన సుప్రా పసిఫిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తమ దీర్ఘకాలిక వృద్ధి వ్యూహంలో భాగంగా, రాబోయే మూడేళ్లలో 15 రాష్ట్రాలలో 500 శాఖలను ఏర్పాటు చేయటంతో పాటుగా రూ. 2,500 కోట్ల ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు నేడు వెల్లడించింది. 

ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఐడిసి) ఛైర్మన్ శ్రీ మహేష్ థక్కర్, సుప్రా పసిఫిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓ శ్రీ మనోజ్ రవి, ప్రముఖ పరిశ్రమ నాయకులు, కీలక భాగస్వాములు ,  కంపెనీ నాయకత్వ బృంద సభ్యుల సమక్షంలో, ముంబైలోని అంధేరిలో కంపెనీ తమ కొత్త కార్పొరేట్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది.

తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే సుప్రాపసిఫిక్ తమకార్యకలాపాలనునిర్వహిస్తుండగా  కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. 

ఈ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ ఆస్తులను రూ. 290 కోట్ల నుండి రూ. 499 కోట్లకు, అంటే 64.39% పెంచుకుంది. రాబోయే మూడు సంవత్సరాలలోపు రూ. 2,500 కోట్ల ను చేరుకోవాలని లక్ష్యం చేసుకుంది. 

కంపెనీ వృద్ధి ప్రణాళికలపై సుప్రా పసిఫిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓ శ్రీ మనోజ్ రవి మాట్లాడుతూ ” ఆర్థిక సమ్మిళిత పరంగా గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ అనేక ప్రాంతాలలో అధికారిక రుణాల లభ్యత, ముఖ్యంగా బంగారు రుణాలు , చిన్న వ్యాపార రుణాల లభ్యత పరిమితంగానే ఉంది. దేశవ్యాప్తంగా మా కార్యకలాపాలను విస్తృతం చేయడం ద్వారా భారతదేశ ఆర్థిక సమ్మిళిత అజెండాకు అర్థవంతంగా దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు. 

తన దీర్ఘకాలిక వృద్ధి వ్యూహంలో భాగంగా, కంపెనీ రాబోయే మూడేళ్లలో తమ ఉద్యోగుల సంఖ్యను 700 నుండి 2,000కు పైగా పెంచాలని మరియు తన భవిష్యత్ వృద్ధి ప్రణాళికలకు మద్దతుగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ల (ఎన్ సి డి) పబ్లిక్ ఇష్యూను ప్రారంభించాలని కూడా యోచిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -