టీసీఎస్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ ఆర్డర్‌

– రూ.1500 కోట్ల పరికరాల సరఫరా
న్యూఢిల్లీ : టీసీఎస్‌ నేతృత్వంలోని కన్సోరియం రూ.1500 కోట్ల విలువ చేసే బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ నెటవర్క్‌ ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. టాటా గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన తేజస్‌ నెట్‌వర్క్స్‌ కన్సార్టియం బీఎస్‌ఎన్‌ఎల్‌కు రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌ పరికరాలను సరఫరా చేయనుంది. అదే విధంగా సేవలను అందించనుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి రూ.15,000 కోట్ల విలువైన ముందస్తు కొనుగోలు ఆర్డర్‌ను పొందినట్టు టీసీఎస్‌ సోమవారం తన రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పాన్‌ ఇండియా 4జి ప్రాజెక్ట్‌ కోసం వేసిన వేలంలో తేజస్‌ నెట్‌వర్క్స్‌ విజయవంతంగా బిడ్‌ను దక్కించుకుందని వెల్లడించింది. కోర్‌ డొమైన్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌లో వివిధ ముఖ్యమైన విధులను నిర్వహించనున్నామని పేర్కొంది. వీటిలో కనెక్టివిటీ, మొబిలిటీ మేనేజ్‌మెంట్‌, అథెంటికేషన్‌, ఆథరైజేషన్‌, సబ్‌స్రయిబర్‌ డేటా, పాలసీ మేనేజ్‌మెంట్‌ మొదలైనవి ఉన్నాయని ఆ సంస్థ వెల్లడించింది.

Spread the love