
విద్యుత్ షాక్ తో గేదె మృతి చెందిన సంఘటన మండలంలోని దాట్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నా పి. చనమల్లు కు చెందిన గేదె మేతకు తీసుకెళ్తున్న క్రమంలో ఊరిలోని మార్గమధ్యంలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైరు కు తగిలి మృతి చెందింది. అప్పు చేసి రూ 70వేలకు గేదెను కొనుగోలు చేసినట్టు రైతు తెలిపారు. విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్లకు ఫెన్సింగ్ వెయ్యకనే ఈ ఘటన జరిగిందని రైతు తెలిపాడు.