Monday, June 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపంట అవశేషాలకు నిప్ప

పంట అవశేషాలకు నిప్ప

- Advertisement -

​మంటల్లో చిక్కుకుని 7 గొర్రె పిల్లలు మృత్యువాత
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో ఘటన
నవతెలంగాణ -పెద్దవంగర/ఆర్మూర్

ప్రమాదవశాత్తు పంట అవశేషాలకు నిప్ప్పు అంటుకుని 7 గొర్రె పిల్లలు మృత్యువాత పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవంగర పశు వైద్యశాల సమీపంలో అనుమానాస్పదంగా పంట అవశేషాలకు నిప్పు అంటుకుంది. ఒక్కసారిగా మంటలు చుట్టూ వ్యాపించి కందుల లెనిన్ కు చెందిన 7 గొర్రె పిల్లలు చిక్కుకున్నాయి. గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. అయితే అప్పటికే పొదిలో ఉన్న 7 గొర్రె పిల్లలు మంటల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డాయి. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, ఉప సర్పంచ్ వినోద్, వార్డు సభ్యులు, జీపీ సిబ్బంది సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఎస్ చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ సిబ్బందితో సంఘటనా స్థలాఁకి చేరుకుని, ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. కాసేపటికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పి వేశారు. ఆ పక్కనే గడ్డివాము, నివాస గహాలు ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రూ. లక్ష వరకు నష్టం వాటిల్లింది. బాధిత రైతుకు ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు. కాగా మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామంలో పలుగోటి దుబ్బా ప్రాంతంలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల్లో పైపులు, వైర్లు, స్టాటర్లు దగ్ధమయ్యాయి. రైతులకు నష్టపరిహారం చెల్లించి, ఆదుకోవాలని స్థానికులు కోరారు.

నిజామాబాద్ లో సిలిండర్ లీకేజీతో అగ్ని ప్రమాదం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని హనుమాన్ కాలనీలో సిలిండర్ లీకేజీతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాలనీలోని ఆదిత్య చికెన్ సెంటర్, కిరాణా దుకాణంలో గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో తల్లి కొండూరు రుక్మాబాయి, కుమారుడు రాజేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు తీవ్రంగా వ్యాపించడం వల్ల స్థానికుల సమాచారంతో ఎస్‌హెచ్ఓ సత్యనారాయణగౌడ్, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. గాయపడ్డ రుక్మాబాయి, రాజేష్‌ను నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, తల్లిని కాపాడే క్రమంలో కొడుకు రాజేష్ కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. కాగా రుక్మాబాయి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -