Monday, June 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రయివేటు బ్లడ్‌ బ్యాంకుల ఇష్టారాజ్యం..!

ప్రయివేటు బ్లడ్‌ బ్యాంకుల ఇష్టారాజ్యం..!

- Advertisement -

కానరాని 30శాతం రక్తం ఇవ్వాలన్న నిబంధన
ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులకు ఎగనామం
సామర్థ్యానికి మించి నిల్వలు
ఇతర అవసరాలకు విక్రయాలు
స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం
పట్టనట్టు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు

నవతెలంగాణ-సిటీబ్యూరో
​రక్తం ఆపదలో ఉన్నవారికి అత్యవసరం. రక్తం అందని సందర్భంలో ప్రాణాలు కోల్పోయినవారు ఎందరో ఉన్నారు. రక్తహీనత, తలసేమియాతో బాధపడేవారు చాలామంది రక్త దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఆపదలో ఉన్నవారితో పాటు దీర్ఘకాలికంగా రక్తం అవసరం ఉన్నవారి కోసం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పుట్టినరోజుల సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. స్వచ్చంద సంస్థలు, ప్రయివేటు బ్లడ్‌ ‌బ్యాంకుల ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన రక్తంలో ప్రయివేటు బ్లడ్‌ ‌బ్యాంకుల్లో అదే రోజు 30శాతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు ఇవ్వాలి. కానీ ఇది గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌నగరంలో సక్రమంగా అమలు కావడం లేదు. దాంతో పేదలకు అత్యవసరమైన సమయంలో రక్తం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులు సైతం ఈ విషయమై పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో ప్రయివేటు బ్లడ్‌ ‌బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

​ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా..
​పేద రోగులు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్రమంలో ఆసరమైన వారికి ప్రభుత్వ బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌నుంచి ఉచితంగా రక్తం అందిస్తారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, నిమ్‌్సతోపాటు మరికొన్ని ఆస్పత్రులకు వైద్యం కోసం సిటీ నుంచే గాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి నిరుపేదలకు వస్తుంటారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, రక్తహీనతతో బాధపడే వారు, డెలివరీల కోసం వచ్చేవారికి రక్తం అవసరం అవుతుంది. డిమాండ్‌‌కు సరిపడా డోనర్స్ నుంచి రక్తం అందకపోవడంతో రక్తం కొరత ఏర్పడుతోంది.

గ్రేటర్‌‌లో 85 బ్లడ్ బ్యాంకులు​
గ్రేటర్‌ పరిధిలో 85 వరకు ప్రభుత్వ, ప్రయివేటు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో ఎన్జీవోలకు చెందినవి 38 వరకు ఉన్నాయి. ప్రతి ఏడాదీ గ్రేటర్‌‌లో 4లక్ష‍ల యూనిట్లకు పైగా రక్తం అవసరం ఉంటుంది. ఒక్క నారాయణగూడలోని ఐపీఎం (ఇండియన్‌ ‌ప్రివెన్సివ్‌ ‌మెడిసిన్‌) ‌నుంచే సాధారణ రోజుల్లో 100-150 యూనిట్ల వరకు రక్తం నిలోఫర్‌, ఉస్మానియా, ప్లేబ్లబుర్జు ఆస్పత్రుకు సరఫరా చేస్తుంటారు. వైద్య శిబిరాల ద్వారా సేకరించే రక్తంలో 30శాతం ప్రభుత్వ బ్లడ్‌ ‌బ్యాంకులకు ఇవ్వాల్సి ఉన్నా.. జరగడం లేదు. దాంతో తలసేమియా బాధితులతోపాటు సర్కార్‌ ఆస్పత్రులకు వచ్చే పేద వారికి సైతం రక్తం దొరకని పరిస్థితి నెలకొంది. ఒక్క రెడ్‌‌క్రాస్‌ ‌నుంచి తప్ప మిగతా బ్లడ్‌ ‌బ్యాంకుల నుంచి ఆశించిన స్థాయిలో రక్తం ఇవ్వడం లేదు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగులకు అందజేయాల్సి ఉన్నా.. నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని ఉస్మా నియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌‌జే క్యాన్సర్‌ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అంద జేయాలనే నిబందన ఉన్నా.. దీన్ని నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.

​దాడులు చేసినా మారని తీరు
నగరంలోని పలు రక్తనిధి కేంద్రాల్లో రక్తపు నిల్వలు నిండుకున్నాయి. దీన్ని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అవకాశంగా తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు హోల్ బ్లడ్ సహా ప్లాస్మా, ప్లేట్లెట్స్ ను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల పేరుతో భారీగా దండుకుంటున్నారు అని రక్తపిశాచులపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అప్రమత్తమై.. అనుమానం ఉన్న బ్లడ్ బ్యాంకులపై దాడులు నిర్వహిం చారు. స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న పలు బ్లడ్ బ్యాంకులను గుర్తించి, వాటి లైసెన్సులను రద్దు చేశారు. అయినా వారి ఆగడాలు ఆగడం లేదు.

​కృత్రిమ కొరత సృష్టించి విక్రయాలు​
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు అధిక రక్తస్రావంతో బాధపడుతుంటారు. గర్భిణుల ప్రసవాలతో పాటు పలు కీలక సర్జరీల్లోనూ రక్తస్రావం అధికంగా ఉంటుంది. ఇలాంటి వారికి తక్షణమే ఆయా గ్రూపుల రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. డెంగీ జ్వరంతో బాధ పడే వారికి తెల్లరక్తకణాలు ఎక్కించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగుల బంధువులు నమూనాలు తీసుకుని సమీపంలోని రక్తనిధి కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. రోగుల బంధువుల్లో ఉన్న బలహీనతను అక్రమార్కులు అవకాశంగా తీసుకుంటున్నారు. హోల్ బ్లడ్ సహా ప్లాస్మా, ప్లేట్లెట్‌ ‌ను ఆయా బ్లడ్ బ్యాంకుల సామర్ధ్యానికి మించి నిల్వ చేసి, మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. రక్తపు కొరత పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -