ప్రశాంతంగా టీఎస్ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష

– నల్గొండలో 331 మంది విద్యార్థుల హాజరు
 నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ 
తెలంగాణలోని రెండు సంవత్సరాల బిఈడి కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో గురువారం నిర్వహించిన టీఎస్ ఎడ్  సెట్ -2024 ప్రవేశ పరీక్ష నల్గొండలో ప్రశాంతంగా ముగిసింది. నల్గొండ లోని ఎస్ పి ఆర్ పాఠశాల ఆవరణలోని ఆన్లైన్ పరీక్ష కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు,. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్ట్ లో జరిగిన పరీక్షలకు 360 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 331 మంది విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 162 మంది మధ్యాహ్నం 169 మంది హాజరుకాగా 29 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలను టీఎస్ ఎడ్సెట్ పరిశీలకులు, నల్గొండ లోని డివిఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైస్ ప్రిన్సిపల్ బొడ్డుపల్లి రామకృష్ణ పర్యవేక్షణ చేశారు. వారి వెంట పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్ నీలం రెడ్డి ఉన్నారు.
Spread the love