ఏపీలో రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

నవతెలంగాణ-హైదరాబాద్ :  అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యాప్తంగా శుక్రవారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు , కృష్ణ, ఎన్టీఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లా్ల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది . శని, ఆదివారాల్లోనూ కొన్ని చోట్లు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రేపు 33 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఈ నెల 30న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నందున, ఏపీలోకి జూన్‌ మొదటివారంలో వర్షాలు విస్తరించే సూచనలు ఉన్నాయని వివరించారు.

Spread the love