రేపే టీఎస్ పాలిసెట్…

నవతెలంగాణ-హైదరాబాద్ : రేపు అనగా శుక్రవారం 24వ తేదీన టీఎస్ పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఈ పరీక్ష జరగనుంది. ఇప్పటికే అధికారులు 259 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.ఈ ప్రవేశ పరీక్షకు 92,808 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. పరీక్షా కేంద్రంలోకి గంట ముందు నుండి అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు అని తెలిపారు. కాబట్టి విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇక విద్యార్థులు హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, ఏరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి అని వెల్లడించారు.

Spread the love