దూకుళ్లాట ఆగలే!

Can't stop jumping!ఇది చిన్న పిల్లలు ఆడుకునే ఆట గురించి కాదు… పెద్దోళ్లు… పొలిటీషియన్స్‌… దిగజారిన బూర్జువా పొలిటీ షియన్స్‌ ఆడుకునే దూకుళ్లాట గురించి… నవంబరు పదితో తెలంగాణలో ‘దూకుడాగి’ పోతుందని భ్రమించిన వారు న్నారు. ‘ఆశకు అంతెక్కడుందే పిచ్చిదానా!’ అన్న గుండమ్మ కథలో రమణారెడ్డి డైలాగు చాలా మంది మరిచి పోయుం టారు. లేదా కొందరికి తెలిసే ఉండదు. కాని, రాజకీయ దూకుళ్లాటకు మరిగిన వారికి ఆ డైలాగు గురించి మాబాగా తెల్సు.
తన ప్రస్థానం ఎక్కడ మొదలైందో ఆ మూలాలు మెదడులో నుండి తుడిపేసుకున్న తర్వాత ఒక వ్యక్తి కాషాయ పార్టీలో ‘కుదిరితే కప్పు కాఫీ వీలైతే నాలుగు మాటల’న్నట్లు ముఖ్యమంత్రి పీఠం పై ఆశతో నిద్రలేని రాత్రులు గడుపుతుండగా, మరొకరు జస్ట్‌ మింగ బోతుండగా మంచి నేతిగారెను ‘గద్దొ’చ్చి తన్నుకుపోవడం తో వేములవాడ రాజన్న ముందు భోరున విలపిస్తే ఏం ఫాయిదా? రాబందులతో స్నేహానికి సిద్ధపడి, రాబందుల పార్టీలో స్థిరపడే ప్రయత్నం చేసిన వారికి ఆపాటి అవమా నాలు ‘టేకిటీజీ’గా తీస్కోవాలే! అయినా పోయిందేముంది? ‘గులాబీ పుష్పకం’ రెడీగ ఉందిగా! చిన్న దొర ఢంకా బజా యించి చెప్తున్నట్లు డిసెంబరు 3 తర్వాత మళ్లీ గులాబీలే వికసిస్తే ‘మండలి’ లేదా!? ఆ రూట్‌లో మంత్రి పదవి దొర క్కపోదా? ఇంతకింత కమాయించ లేకపోతమా? అనే ‘ఆశ’ సంతృప్తి నివ్వగా, కలల లోకంలో విహరిస్తూ గులాబీ పుష్ప కంలోకి జంప్‌! పాల్వాయి వంశాంకురం కాంగ్రెస్‌ ద్రాక్ష తోటలో ఎగిరీ, ఎగిరి ఏ పండూ అందక పోయేసరికి జ్ఞానో దయమై ”ఛీ…ఇది బ్రోకర్ల పార్టీ” అంటూ కంటతడి పెట్టిం ది. నెత్తిన కుండ ఉండటం, అదీ ఓటిది కావడం వల్ల స్త్రీలు ప్రతి విషయంలోనూ భోరుమంటూంటారనే పేరుంది. ఇది పూర్తిగా తప్పని రుజువు చేసిన ఎందరో పురుష పుంగవులు న్నారు. జనగామ సీటు నుండి కిందకి నెట్టేసినందుకు ఆ నాయకుడు ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి దొరికే దాకా ఏడ్చిగోల చేసిన సంగతికి మీడియానే సాక్షి. ఇక తాజాగా సూర్యాపేటలో, అంతకుముందు స్టేషన్‌ ఘన్‌పూర్‌లో భంగపడిన రమేష్‌, రాజాల ఎక్కిళ్ళు ఇంకా తగ్గనేలేదు.
”పుక్కట్లో ఇచ్చారా కాంగ్రెసోళ్ళు! వందకోట్లిచ్చి నాకు, నా కొడుక్కి ఫ్యామిలీ ప్యాక్‌ తెచ్చుకున్నా” అని ధైర్యంగా చెప్పి ఇట్నుంచి అటు జంపగల హన్మంతులున్నారు. పార్టీ భక్తుల, పోస్టు భక్తుల కలగాపులగంగా నేటి ఎన్నికల సీన్‌ తెలంగాణలో నడుస్తోంది. వీరిలో దీర్ఘదర్శులె వరో, వచ్చిన దానికే తృప్తిపడే ప్రాప్తకాలజ్ఞులెవరో తేలాలంటే మరో పాతిక రోజులు ఓపిక పట్టాల్సిందే మరి.
కులాన్ని బట్టి, దాని కుండే ఓటింగు బలాన్ని బట్టి అభ్య ర్థుల ఫైనలైజేషన్‌ జరిగే కాలం గతించింది. అది బీజేపీ అయినా, కాంగ్రెస్‌ అయినా, బీఆర్‌ఎస్‌ అయినా ‘పైకి’ ఎంతిస్తాడు? కిందికి ఎంత ‘వదల’గలడు? అనేదే కీలక విషయం నేడు. అందుకే దూకుళ్ళాట ఫలి తాలొచ్చిన తర్వాత కూడా సాగుతుందని గత తొమ్మి దేండ్లుగా కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ బుట్టలు ఖాళీ అయి ‘గులాబీ’ చెట్టుకు అంటుకట్టినట్లు అతుక్కోవడం చూస్తు న్నాం కదా!
నడుచుకుంటూ వచ్చే ‘ఆయారామ్‌ గయా రామ్‌ల కాలం చెల్లిపోయి జంపింగ్‌ జిలానీల రోజులు రావడం వెనుక పరమార్థం ఈ ఐదున్నర దశాబ్దాల్లో పెరిగిన డబ్బు పాత్ర ఉదారవాద విధానాల ‘పుణ్యం’. రాత్రికి రాత్రే శత కోటీశ్వరులయిపోయే మార్గాలు తెరుచుకోవడం దారులు పరుచుకోవడంతో పెట్టుబడిదార్లు పండగ చేసుకుంటు న్నారు. దీనికి ‘రాజకీయం’ ఒక సోపానమవుతోంది. సంప ద గుట్టలు తేలే పెట్టుబడిదారులను వదిలి రాజకీయాలం టేనే అవినీతిమయమన్నట్టు ‘బుద్ధి’జీవులు కొందరు సమా జాన్ని కలుషితం చేశారు. ‘కోల్‌గేట్‌’ వెనుకున్న జిందా ల్‌లను, ఇతర పెట్టుబడిదార్లను, 2జి స్పెక్ట్రమ్‌ వల్ల ప్రయో జనం పొందిన టాటాలను, అంబానీలను వదిలి కణిమొళి, రాజా చుట్టు కథనాలు అల్లిన మీడియా అసలు దొంగల్ని చూప లేదు. అదే మీడియా నేడు 261 బ్లాకులను వేలం పాటలో వదిలించుకున్న మోడీ ప్రభుత్వంపై పల్లెత్తుమాట అనదు. దాదాపు దేశంలోని విమా నాశ్రయాలను, పోర్టులను హస్తగతం చేసుకుం టున్న అదానీని బహిర్గతం చేయదు.
రాజకీయాల్లోకి ప్రవేశిస్తే సులభంగా కోట్లు కూడగట్టు కోవచ్చనే దానికి ఎన్నో ఉదాహ రణలు దేశంలో కనపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండి ఉంటే 2-జి స్పెక్ట్రమ్‌కు, కోల్‌గేట్‌కు అవకాశాలే ఉండేవి కాదు కదా! అందుకే సరళీకృత ఆర్థిక విధానాలంటేనే అవినీతి. అందుకే ఆ విధానాల కోసం కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎగబడ్తు న్నాయి. విధానాలను కూలగొట్టడానికి కార్మికులు పోరాడుతున్నారు.
‘కోర్టులు, పత్రికలు, మేధావులూ పట్టించు కోకుండాపోయిన వాస్తవా’లివి. ప్రజలు, మరీ ముఖ్యంగా యువత నలుపునీ, తెలుపునీ గుర్తించడంతో ఆగిపోకూడదు. కారణాలను శోధించి, మధించి నూతన వెలుగులను సాధించాలి.

Spread the love