Sunday, May 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమాదాపూర్‌లో కార్ రేసర్ల వీరంగం..కానిస్టేబుల్‌కు గాయం

మాదాపూర్‌లో కార్ రేసర్ల వీరంగం..కానిస్టేబుల్‌కు గాయం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఐటీ హబ్ మాదాపూర్‌లో యువకులు మరోసారి బరితెగించారు. అర్ధరాత్రి కార్ రేసింగ్‌తో హల్‌చల్ సృష్టించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టడంతో అతడి చేతికి ఫ్రాక్చర్ అయింది.

మాదాపూర్‌లోని నిలోఫర్ కేఫ్ సమీపంలో కొందరు యువకులు కార్ రేసింగ్, స్టంట్లు చేస్తూ గందరగోళం సృష్టించారు. మోడిఫైడ్ సైలెన్సర్‌తో ఓ కారు బీభత్సం సృష్టిస్తుండగా, లాఠీలతో ఉన్న ముగ్గురు పోలీసులు దానిని ఆపేందుకు ప్రయత్నించారు. కారు ఆగకపోవడంతో వెంబడించారు. ఈ క్రమంలో రమేష్ అనే కానిస్టేబుల్ కారును ఆపే ప్రయత్నం చేయగా, డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే అతడిని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ చేతికి గాయమైంది. కారు డ్రైవర్‌ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియోలో, ఈ రేసింగ్ చూసేందుకు చాలా మంది యువకులు రోడ్డుపై గుమిగూడినట్లు కనిపించింది.

వారాంతాల్లో ఐటీ కారిడార్‌లో యువకులు ప్రమాదకరమైన కార్, బైక్ రేసింగ్‌లకు పాల్పడటం సాధారణమైపోయింది. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా వారు పట్టించుకోవడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -