Sunday, May 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకోకాపేటలో భారీ అగ్నిప్రమాదం..ఒక్కసారిగా చెలరేగిన మంటలు

కోకాపేటలో భారీ అగ్నిప్రమాదం..ఒక్కసారిగా చెలరేగిన మంటలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం కోకాపేటలోని మూవీ టవర్స్ అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్రమంగా అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్లకు వ్యాపించే అవకాశం ఉండటంతో.. అపార్ట్ మెంట్ వాసులు భయంతో బయటికి పరుగులు తీశారు. సి – బ్లాక్ లోని సెల్లార్ మంటలు చెలరేగడంతో.. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వగా.. ఫైరింజన్లు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటల్ని ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. కాగా.. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఏరియా పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -