నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన 69వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) 30 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ (MI)పై అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి.
వాంఖడే స్ట్రేడియంలో రాజస్థాన్ రాయల్స్.. 20 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన ముంబాయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన ఆర్‌ఆర్ ఓపెనర్లు జైస్వాల్ దూకుడుగా అడినా..23 పరుగులకే వెనుదిరిగాడు. భారీ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ కీలకపోరులో తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఎంఐ బౌలర్లు లైన్ అండ్ లెన్త్ బౌలింగ్ తో పరుగుల కట్టడితో పాటు వికెట్లు తీశారు. దీంతో పవర్ ప్లే ముగిసేరికి ఆర్‌ఆర్ 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జురేల్(38), పరాగ్(14), ఫెరీరా(18),శనక(29) కొద్ది సేపు ఎంఐ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. వారి ధనాధన్ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో భారీ స్కోర్ దిశగా ఆర్ ఆర్ దూసుకెళ్లింది. చివర్లో ఆర్చర్ 15 బంతుల్లో 32 పరుగులు, జడేజా 11 బంతుల్లో 19 రన్స్ కొట్టారు. దీంతో ఎంఐకి 205 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఎంఐ బౌలర్లు శార్దుల్, చాహర్, రెండు వికెట్లు, బోట్, జాక్స్, గాజాపర్ తలా ఒక వికెట్ తీశాడు.
అనంతరం 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 4 బంతులు ఎదుర్కొని సున్నా పరుగులకే (డకౌట్) జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధీర్ (6) కూడా ఆర్చర్ వేటకే బలయ్యాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (12), తిలక్ వర్మ (3) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ముంబయి 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.



