Sunday, May 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమద్యం మత్తులో ఆర్ఎస్ఐ కారు బీభత్సం..

మద్యం మత్తులో ఆర్ఎస్ఐ కారు బీభత్సం..

- Advertisement -

– స్కూటీని డీకొట్టి ఇద్దరిని గాయపరిచిన వైనం
నవతెలంగాణ-పరకాల: శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి మద్యం మత్తులో కారు నడుపుతూ రోడ్డుపై బీభత్సం సృష్టించారు. పరకాల పట్టణానికి చెందిన ఆర్ఎస్ఐ గోవింద అవినాష్ మద్యం మత్తులో కారు నడిపి, ఒక స్కూటీని బలంగా డీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పరకాల మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన తిక్క పద్మ, సంజీవ వరకు పని నిమిత్తం వచ్చి తిరిగి స్వగ్రామం స్కూటీ (నెంబరు టిఎస్ 25 9442) పై వెళ్తుండగా, ఆర్ఎస్ఐ అవినాష్ తన కారు (నెంబరు టిఎస్ 03 యుడి 3458) తో అతి వేగంతో వచ్చి వారిని ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పద్మ, సంజీవలను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే సదరు ఆర్ఎస్ఐ అక్కడి నుండి పరారవ్వడం గమనార్హం. పూర్తిగా మద్యం మత్తులో ఉండటం వల్లే ఆయన ప్రమాదానికి కారణమయ్యారని, అందుకే అక్కడి నుండి ఉడాయించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఆర్ఎస్ఐ అవినాష్ తన కుటుంబ సభ్యులను రంగంలోకి దించి, బాధితుల కుటుంబంతో రహస్యంగా రాజీ మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. పోలీస్ అధికారి అయి ఉండి తాగి వాహనం నడపడమే కాకుండా, ప్రమాదం తర్వాత రాజీ ప్రయత్నాలకు తెరలేపడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -