- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్, అతడి తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్‌పై భోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమను దూషించి, దాడి చేశారని ఇంట్లో పనిచేసే వంట మనిషి ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. వంట మనిషిగా చేరిన తనకు ఉచిత వసతి, భోజనం, జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో సహాయం చేస్తామని హామీ ఇచ్చారని, అయితే వంటల్లో నాణ్యత లేదని తనను దూషించి, కొట్టి, ఫోన్ లాక్కున్నారని బాధితుడు ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



