Tuesday, June 30, 2026
E-PAPER
Homeజాతీయంప్రధాన న్యాయమూర్తికి ఇండియా బ్లాక్ కూటమి లేఖ

ప్రధాన న్యాయమూర్తికి ఇండియా బ్లాక్ కూటమి లేఖ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఎన్నికల కమిషన్ చేపట్టిన దేశవ్యాప్త సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు మరోసారి తమ స్వరాన్ని పెంచాయి. ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఉందని ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. తాజాగా దేశవ్యాప్తంగా చేపడుతున్న సర్‌ (ఎస్‌ఐఆర్‌), ఎన్నికల కమిషనర్‌ సహా ఇతర ఎన్నికల సంబంధిత సమస్యలపై ప్రతిపక్ష‍ాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజెఐ)కి లేఖరాశాయి.

23 ప్రతిపక్షపార్టీలతో పాటు స్వతంత్ర ఎంపి సంయుక్తంగా మంగళవారం సీజెఐకి లేఖను పంపినట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ పేర్కొన్నారు. జైరాం రమేష్‌ ఈ వివరాలను తెలియజేస్తూ.. ప్రతిపక్ష‍ాలు ‘‘ఎస్‌యుఆర్‌ఇ – సంఘీభావం, ఐక్యత, ప్రతిఘటన’’ అనే సూత్రానికి ధృడంగా కట్టుబడి ఉన్నాయని అన్నారు.

23 ప్రతిపక్ష‍పార్టీలకు చెందిన నేతలతో పాటు స్వతంత్ర ఎంపి కపిల్‌ సిబాల్‌ ఈ లేఖపై సంతకాలు చేశారని అన్నారు. జూన్‌ 8న జరిగిన ఇండియా బ్లాక్‌ సమావేశంలో సీజెఐకి సంయుక్తంగా లేఖ రాయాలని 21 పార్టీలు నిర్ణయం తీసుకున్నాయని ఆయన ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ లేఖపై డీఎంకె, ఆప్‌ పార్టీలు కూడా సంతకాలు చేశాయని టీఎంసీనేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ తెలిపారు. ఆప్‌, డీఎంకెలు తిరిగి ఇండియా బ్లాక్‌లో చేరడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌ ప్రాతపై లేఖలో విస్త్రృతంగా చర్చించారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -