– మరో ఇద్దర్ని అరెస్ట్ చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీక్ కేసు లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరో ఇద్దరిని అదుపులో తీసుకుంది. అరెస్టయిన ఇద్దరు నిందితుల్లో ఒకరు నీట్ అభ్యర్థి కాగా, మరొకరు మరో నీట్ అభ్యర్థి తండ్రి అని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. వారిద్దరూ బీహార్‌కు చెందినవారేనని తెలిపాయి. ఒకరిని నలంద జిల్లాలో, మరొకరిని గయా జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అభ్యర్థులతో ఒత్తిడితో ఈ అశంపై కేంద్రం సీబీఐ ఎంక్వయిరీ వేసింది. ప్రస్తుతం కేసు విచారణ జరుపుతోన్న సీబీఐ కేసుతో సంబంధం పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తోంది.