దాసరి సేవా రత్న అవార్డును అందుకున్న చల్లా బ్రదర్స్

నవతెలంగాణ – సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన చల్లా కన్స్ట్రక్షన్స్ అధినేతలు చల్లా లక్ష్మీకాంత్, చల్లా లక్ష్మీప్రసాద్ సోదరులు దాసరి సేవా రత్న అవార్డును అందుకున్నారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన సమావేశంలో అవార్డును అందుకున్నట్లు గురువారం వారు విలేకరుల సమావేశంలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని అనేక సేవా కార్యక్రమాలను వారు నిర్వహిస్తున్నారు. వారి సేవలను గుర్తించిన తెలుగు ఫిల్మ్ చాంబర్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలుగు దర్శకుల మండలి, మా అసోసియేషన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా మాజీ అధ్యక్షులు జయభేరి ప్రొడక్షన్ అధినేత మురళీమోహన్,  డైరెక్టర్ల సంఘం అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజ,  ప్రముఖ హీరో లు సుమన్,  జెడి చక్రవర్తి,  దర్శకులు రేలంగి నరసింహారావు,  ముత్యాల సుబ్బయ్య,  హీరోయిన్ కవిత,  దవల సత్యం, మాదాల రవి,  ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ల చేతుల మీదుగా వారు అవార్డును స్వీకరించారు. జిల్లా కేంద్రంకు చెందిన చల్లా బ్రదర్స్ కు దాసరి ఫిలింఫేర్ అవార్డు రావడం పట్ల జిల్లా ప్రజలు, పట్టణ ప్రముఖులు, మేధావులు అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు  తెలిపారు.ఈ సందర్భంగా చల్లా బ్రదర్స్ మాట్లాడుతూ.. ఈ అవార్డ్ తమలో మరింత బాధ్యత పెంచిందని తెలిపారు. సేవ కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ గా వీటిని కొనసాగిస్తామని చెప్పారు. తమ సేవలను గుర్తించి అవార్డ్ ఇచ్చిన పెద్దలకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
Spread the love