బ్లూ టైగర్స్‌కు సవాల్‌

A challenge for the Blue Tigers– బంగ్లాదేశ్‌తో భారత్‌ ఢీ నేడు
షిల్లాంగ్‌ (మేఘాలయ): భారత ఫుట్‌బాల్‌ కొత్త సీజన్‌ సవాల్‌కు సిద్ధమైంది. ఏడాదిన్నరకు పైగా గెలుపు లేకుండా సాగిన భారత సాకర్‌ జట్టు ప్రయాణం.. సూపర్‌స్టార్‌ సునీల్‌ ఛెత్రీ రీ ఎంట్రీతో ముగిసింది. గత వారం జరిగిన మ్యాచ్‌లో మాల్దీవులపై 3-0తో గెలుపొందిన భారత్‌ అదే ఉత్సాహంతో నేడు ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ క్వాలిఫయింగ్‌ గ్రూప్‌-సి పోరులో బంగ్లాదేశ్‌ను ఢకొీట్టనుంది. సునీల్‌ ఛెత్రి, లిస్టన్‌ కొలాకోలు గోల్స్‌ వేటలో ముందుండి నడిపిస్తున్నారు. ఫార్వర్డ్‌ ఛెత్రి, మిడ్‌ ఫీల్డర్‌ లిస్టన్‌లు పాదరసంలా కదులుతూ ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదిస్తున్నారు. కానీ బంగ్లాదేశ్‌ తరఫున ఇంగ్లాండ్‌ సాకర్‌ ప్రొఫెషనల్‌ హమ్జా చౌదరి అరంగేట్రం చేయనున్నాడు. దక్షిణాసియా జట్టు తరఫున ఓ హై ప్రొఫైల్‌ ఆటగాడు బరిలోకి దిగటం ఇదే తొలిసారి. ఏమాత్రం ఒత్తిడికి గురి కాని, ప్రత్యర్థి బలానికి బెదరని ఆటగాడు హమ్జా. నేడు ఛెత్రి, లిస్టన్‌ జంట హమ్జాను నిలువరించి భారత్‌ను విజేతగా నిలబెడతారా? చూడాలి. భారత్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుండగా.. స్టార్‌స్పోర్ట్స్‌, హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది.

Spread the love