ఛలో హైదరాబాద్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వండి

Chalo give permission to go to Hyderabadనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 25న ఛలో హైదరాబాద్ కార్యక్రమం ఉందని కావున ఈ మహా ధర్నాకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దర్శనాల నాగేష్ కోరారు. ఈ విషయమై బుధవారం మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ సిబ్బంది పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 25న చేపట్టే మహాధర్నాకు కార్మికులందరూ పాల్గొనాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించుకోవడంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ మహాధర్నాన్ని విజయవంతం చేసే బాధ్యత ప్రతి కార్మికులపై ఉందన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి అగ్గిమల్ల స్వామి, డ్రైవర్ విభాగం అధ్యక్షులు జనార్దన్, జనరల్ సెక్రెటరీ అజీమ్, భొజు, షబ్బీర్ దయానంద్, కుమార్, పాల్గొన్నారు.
Spread the love