ఈ నెల 26న.. చలో రామోజీ ఫిలింసిటీ 

On the 26th of this month.. Chalo Ramoji Filmcity– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.యాదయ్య
– నిర్బంధాలను ఎదిరించి ఇండ్ల స్థలాలను సాధిస్తాం
– అధికారులు కూడా భూ కబ్జాదానికే వత్తాసు
– గుడిసెలు వేసుకున్న పేదలపై కేసులా
– కమ్యూనిస్టులకు కేసులు కొత్త కాదు
– ప్రభుత్వానికి వారం రోజలే గడువు 
– లేకుంటే రామోజీ ఆక్రమించిన స్థలాలకు ఎర్రజెండా నాయకత్వంలో గుడిసెలు వేసుకుంటాం 
– రాయపోల్ లో సన్నాహక సమావేశం
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రతినిధి 
ఈ నెల 26న చలో రామోజీ ఫిలిం సిటీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని  ఇండ్ల స్థలాల పేదలకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యాదయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విధించే నిర్బంధాలు ఎదిరించి, రామోజీరావు ఆక్రమించిన ఇండ స్థలాలను సాధిస్తామనఉన్నారు. రామోజీ ఆక్రమించిన స్థలాలకు విముక్తి కల్పిస్తామన్నారు. అందుకు వారం రోజుల ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ లో మంగళవారం జరిగిన ఇండ్ల స్థలాల పేదలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిగొండ అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో 2007లో అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలను నాగన్ పల్లి, పోల్కంపల్లి, రాయపోల్, ముకునూర్ గ్రామాల పేదలకు ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు జారీ చేసిందని తెలిపారు. కానీ ఆ భూముల్లోకి వెళ్లకుండా రామోజీరావు యాజమాన్యం ఇండ్ల సలాల పేదలను అడ్డుకుంటుందన్నారు. పేదలు ఇండ్లు నిర్మించుకుంటామంటే అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల కేటాయించి ఇండ్ల స్థానాలను వారికే అప్పజెప్పలని డిమాండ్ చేస్తూ దఫదఫాలుగా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఇబ్రహీంపట్నం తహసిల్దార్లను కలిసి వినతి పత్రాలు అందజేశామన్నారు. రామోజీరావు యాజమాన్యం, సీపీఐ(ఎం) నాయకులు, పేదలతో సంయుక్తంగా చర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తామని చెప్పిన మాటను కూడా అధికారులు భేకాతరు చేస్తున్నారని మండిపడ్డారు. అటు ప్రభుత్వం ఇటు అధికారులు, ఎమ్మెల్యే కూడా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యానికే వంత పాడుతున్నారన్నారు. కానీ సీపీఐ(ఎం) నాయకులు పోరాట్టాన్ని అడ్డుకునేందుకు అనేక శక్తులు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. ఎన్ని శక్తులు అడ్డుపడిన, ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించిన, కేసులు నమోదు చేసిన పేదల కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు.
ఇప్పటికే ఈ ఇండ్ల స్థలాల పోరాటంలో సీపీఐ(ఎం) నాయకులపై కేసులు నమోదయాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ వారం రోజుల్లో సమస్య పరిష్కరి చూపకపోతే ఈనెల 26వ తేదీన సీపీఐ(ఎం) నాయకత్వంతో పాటు పేదలందరూ ఇండ్ల స్థలాల్లోకి వెళ్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్ మాట్లాడుతూ.. రామోజీ ఫిలింసిటీ ఆక్రమించిన పేదల ఇండ్ల స్థలాలను వెంటనే విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. పేదల ఇండ్ల స్థలాలను ఆక్రమించిన రామోజీపై కేసులు నమోదు చేయాలని కోరారు. 2007లో ముదిగొండ భూపొరాట అమరుల త్యాగాల ఫలితంగా రంగారెడ్డి జిల్లాల్లో ఇండ్ల స్థలాలను సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సాధించిందని చెప్పారు. అప్పటి ప్రభుత్వం ఆ పోరాటానికి తలొగ్గి పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చిందన్నారు. కానీ సర్టిఫికెట్లు ఇచ్చినా.. ఆ స్థలాల్లోకి పోనివ్వడం లేదన్నారు. గత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కూడా రామోజీకే వత్తాసు పలుకుతున్నారని మండి పడ్డారు. అధికారులు కూడా ఎందుకు రామోజీకి వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు. పేదల భూములు కబ్జా చేసిన రామోజిపై ఎందుకు కేసు పెట్టడం లేదని ప్రశ్నించారు. పేదల ఇండ్ల స్థలాల భూములు ప్రభుత్వానికి అవసరం ఉంటే పట్టా భూములను కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే త్వరలోనే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు ఇండ్ల స్థలాల్లోకి వెళ్తానని హెచ్చరించారు. ఇండ్ల స్థలాల్లోకి వెళ్లకుండా పేదలను అడ్డుకోవాలని చూస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే భాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి సీహెచ్ బుగ్గ రాములు, జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ జంగయ్య, పీ. జగన్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు టి.నర్సింహ, మండల కమిటీ సభ్యులు ఏ వెంకటేష్, ఎ. నర్సింహ, సిహెచ్ నర్సింహ, ఆనంద్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు విజయ, పోల్కంపల్లి శాఖా కార్యదర్శులు కరుణాకర్ రెడ్డి, యాదయ్య, స్వామి, నాయకుల అశోక్, రాయపోల్ మాజీ ఎంపీటీసీ బిక్షపతి తదితరులు ఉన్నారు.
Spread the love