కార్పొరేషన్ అభివృద్ధి కోసం అందరూ సహకరించాలి..

సమావేశంలో మాట్లాడుతున్న మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్
సమావేశంలో మాట్లాడుతున్న మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్
– మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్..
– మొదటి సారి ప్రశాంతంగా కౌన్సిల్ సమావేశం..
నవతెలంగాణ – మీర్ పేట్
కార్పొరేషన్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్ అన్నారు. శుక్రవారం మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం మేయర్ అధ్యక్షతన ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్పొరేటర్లు తమ తమ డివిజన్ల పరిధిలో ఉన్న సమస్యలు, పనులలో అత్యవసరంగా పరిష్కారం చేసేందుకు, అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో రాసి కమిషనర్ ఇవ్వాలని సూచించారు. అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని కార్పొరేటర్లను కోరారు. స్వచ్ఛ మీర్ పేట్ కార్పోరేషన్ గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని దానికి అందరూ సహకారం అందించాలని సూచించారు. అనంతరం పలు పనులకు తీర్మానాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్లు అర్కల భూపాల్ రెడ్డి, కీసర గోవర్ధనరెడ్డి, నగర పాలక సంస్థ అధికారులు కమీషనర్ ఎ వాణి రెడ్డి, యస్.ఈ ఆంజనేయ ప్రసాద్, డిఈఈ గోపీనాథ్, ఏఈఈ శ్రీనివాసులు, మేనేజర్ యన్ వెంకట్ రెడ్డి, ఆర్ఒ ఆంజన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు మరియు నగరపాలక సంస్థ అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love