– స్క్వాస్ ఆసియా క్వాలిఫయర్స్
కౌలాలంపూర్ (మలేషియా): భారత యంగ్ అథ్లెట్లు వీర్ చొట్రాని, అనహత్ సింగ్‌లు స్వ్కాష్ ప్రపంచకప్‌కు అర్హత సాధించారు. కౌలాలంపూర్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌లో విజేతలుగా నిలిచిన అనహత్, వీర్‌లు తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడనున్నారు. రామిత్, అభరు, సెంథిల్‌కుమార్‌లు ఇప్పటికే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో అనహత్ (17) 11-4, 9-11, 11-2, 11-8తో హంగ్‌కాంగ్ అమ్మాయిని ఓడించి మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. మెన్స్ సింగిల్స్ ఫైనల్లో వీర్ (23) 11-3, 11-4, 11-8తో మలేషియా స్టార్ చంద్రన్‌పై విజయంతో టైటిల్ సొంతం చేసుకున్నాడు. స్వ్కాష్ ప్రపంచకప్ మే 9-17 వరకు చికాగోలో జరుగనుంది.