కౌంట్‌డౌన్‌ షురూ.. నేడు చంద్రయాన్‌-3 ప్రయోగం

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ చంద్రయాన్‌ – 3 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. ఏపీలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని లాంచ్‌ పాడ్‌ 2 నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ ల్యాండర్‌, రోవర్‌ను చంద్రుడి పైకి పంపనున్నారు. ఈ ప్రయోగం అన్ని విధాలుగా విజయవంతం అవుతుందని ఇస్రో మాజీ ఛైర్మన్‌ జీ మాధవన్‌ నాయర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్‌-3 ప్రయోగానికి అవసరమైన రాకెట్‌ మిడిల్‌ సెగ్మెంట్‌, బకెట్‌ ఫ్లేంజ్‌, గ్రౌండ్‌ అండ్‌ అంబిలికల్‌ ప్లేట్లను తాము సరఫరా చేశామని ప్రముఖ ఇంజినీరింగ్‌ సంస్థ లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) వెల్లడించింది.

Spread the love