లిక్కర్ దందాకు చెక్.. వెరిట్ యాప్ ఓపెన్ ద్వార

– మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్నికల కమిషన్
 – క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో పూర్తి వివరాలు
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి అక్రమ మద్యం అరికట్టడంలో భాగంగా మద్యం యొక్క వాస్తవికతను తెలుసుకోవడానికి వెరిట్ యాప్ రూపొందించబడిందని యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెరిట్ యాప్ ద్వారా మద్యం బాటిల్లు తెలంగాణ రాష్ట్రానికి చెందినదా కాదా తెలుసుకోవచ్చని లిక్కర్ బాటిల్ పై క్యూ ఆర్ కోడ్ ఉందని దానిని స్కాన్ చేస్తే మద్యం బాటిల్ ఏ రాష్ట్రానికి చెందినది తెలుసుకోవచ్చని, నాన్ డ్యూటీ లిక్కర్ ఎదో నకిలీ లిక్కర్ ఎదో తెలుసుకోవచ్చని ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ వెరిట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజలకు తెలిపారు. అక్రమ గోదాములు, డంపులు, మద్యం అక్రమాలకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 18004252523 నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చునని జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ కుమార్ తెలిపారు.

Spread the love