ఓటరు మహాశయులకు కృతజ్ఞతలు: చెన్నకేశవరావు

– కాంగ్రెస్ విజయానికి కారణం పార్టీని నమ్ముకుని ఉన్న శ్రేణులే..
– కొత్తగా చేరిన వారితో పోతున్న పార్టీ ప్రతిష్ట..
– పార్టీ పూర్వ నేతల ఆవేదన..
నవతెలంగాణ – అశ్వారావుపేట
పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొని,పోలింగ్ ను విజయవంతం చేసిన ఓటరు మహాశయులకు,ఎంతో కాలంగా కాంగ్రెస్ నే నమ్ముకుని పార్టీ ఎదుగుదల కోసం కృషి చేసిన శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతూ సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవరావు అద్యక్షతన మంగళవారం తన గృహం పూర్వ నాయకులు పలువురు తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేసారు.అందులోని సారాంశం ప్రకారం… పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామ సహాయం రఘురామ రెడ్డి గారి విజయం కోసం గ్రామ లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ లు అర్థమయ్యేలా చెప్పి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లతో విజయం సాధించేలా కృషిచేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంతమంది కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించు కున్న మాకు అవమానాలు మిగిలాయి అని, పూటకో పార్టీ మార్చే వాళ్లు, ఇసుక దందా,మట్టి దందా, మద్యం మాఫియా,భూ దందాలు,సెటిల్మెంట్ లు చేసే వాళ్లను మా మీదపెట్టి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని,కాంగ్రెస్ ను బ్రతికించు కున్న వాళ్ళని అవమానిస్తున్నారని,రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కలకాలం ముందుకు సాగాలంటే ప్రజలకు చేరువయ్యే కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవడం ఒక్కటే మార్గం అని అధిష్టానానికి విన్నవించుకున్నారు. కొంతమంది మూర్ఖంగా మా వల్లే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పుకోవడం హాస్యంగా ఉందని,అసలు రాబోయే విజయానికి కారణం గత ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు,అలాగే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం, గతంలో ఈ ప్రాంతంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి తో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడమే ప్రధాన కారణం అని అన్నారు.తిరిగి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అని ప్రజల నమ్మ కం, అలాగే కార్యకర్తల కృషి ఇలా ఎన్నో కోణాలు కాంగ్రెస్ పార్టీకి విజయానికి తోడయ్యాయి అని ఇది ఏ ఒక్కరి గెలుపు కాదు, అందరి కృషి ఫలితం అందరి అభిమానం అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యేష్ట సత్యనారాయణ చౌదరి,దాసరి నాగేంద్ర,మండల పరిషత్ కో – ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా,సత్యవరుపు బాలగంగాధర్( బాలయ్య), చిమటబోయిన సత్యనారాయణ,జల్లిపల్లి దేవ రాజ్,రాచకొండ బంగారు,ఎస్.కే బషీర్,చల్లా రమాదేవి,దాసరి రవి,శివ రాశి సురేష్,చిట్టెమ్మ,మోహన్ రావు లు పాల్గొన్నారు.
Spread the love