ధర్నాను విజయవంతం చేయండి : సీఐటీయూ నాయకులు అర్జున్

నవతెలంగాణ – అశ్వారావుపేట

గ్రామ పంచాయతీ కార్మికులు కు కనీస వేతనం రూ. 28 వేలు ఇవ్వాలని, బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఈనెల 25 తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా ను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ కోరారు. గురువారం గ్రామపంచాయతీ కార్మిక సంఘం సమావేశం వెంకటప్పయ్య అధ్యక్షతన స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు ఇస్తున్న వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని, వేతనాలు సరిగా అందక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.గ్రామ పంచాయతీ కార్మికులు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.గ్రామ పంచాయతీ కార్మికులు మల్టీ పర్పస్ విదానాన్ని రద్దు చేయాలని,సబ్బులు కొబ్బరి నూనె గ్లౌజు లు అందించాలని,పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ నరసింహారావు, శ్రీకాంత్, దీవెన మ్మ, తిరుపతమ్మ, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love