రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి: సీఐటీయూ

నవతెలంగాణ – భువనగిరి
గత ప్రభుత్వము ఇచ్చిన హామీ ప్రకారంగా అంగన్వాడీ టీచర్కు రెండు లక్షలు, అయాలకు  లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  బుదవారం సీఐటీయూ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కి మరియు డి డబ్ల్యూ అంగన్వాడి ప్రాజెక్టు  జిల్లా అధికారి అధికారులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు హెల్పర్లు టీచర్లు హెల్పర్లు గ్రామాలలో పిల్లలకు  విద్యాబుద్ధులు ఆరోగ్య సలహాలు చెపుతూ  వీటితో పాటు ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు సుమారు నెల రోజులపాటు సమ్మె చేయడం జరిగిందన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం చర్చలకు పిలిచి అంగన్వాడి టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరిస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు రెండు లక్షలు ఆయాకు హెల్పర్ కు లక్ష ఇస్తామని ప్రకటించారని తెలిపారు. ఈ హామీలను అమలు చేయాలని కొత్త ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికల అనంతరం ఇప్పటికే అనేకసార్లు మంత్రులు ఉన్న అధికారులకు వినతి పత్రాలు   అందజేశామన్నారు .ప్రభుత్వం నేటికీ కొత్తవి జీవోలు  జారీ చేయలేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం  టీచర్స్ హెల్పర్స్ మనోభావాలను ఏమాత్రం పరిగణంలోకి తీసుకోవడం లేదన్నారు. అంగన్వాడి ఉద్యోగులకు ఆర్థికంగా నష్టం కలిగించే చర్యలు చేపడుతూ ఏకపక్షంగా వేగవంతంగా ముందుకు పోతున్నదన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ అంగన్వాడి ఉద్యోగులకు సమ్మె కాలం వేతనాలు చెల్లించిందన్నారు. సమస్యలు పరిష్కారం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయడం  లేదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడి టీచర్లకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ టీచర్స్ కు రెండు లక్షలు వరకు లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని వారు  కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి  చిలువేరు  రామా   నాయకులు సిద్దేశ్వరి  అనిత  కవిత  వరలక్ష్మి,  లక్ష్మీ, పాల్గొన్నారు.
Spread the love